• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

హైదరాబాదులో మహిళా టీచర్ దారుణ హత్య, సోదరుడిపై అనుమానాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews
Hyderabad
హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో మహిళా దినోత్సవం రోజు ఓ దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లోని అంబర్‌పేటలోని డిడి కాలనీలో ఉంటున్న శిల్ప అనే ఉపాధ్యాయురాలి గొంతు కోసి చంపిన సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. శిల్ప, ఆమె భరత్ గోపి డిడి కాలనీలో గత కొన్నాళ్లుగా ఉంటున్నారు. అయితే శిల్పకు వరుసకు సోదరుడైన శేషు అనే వ్యక్తి వీరి ఇంటిలోనే ఉద్యోగ నిమిత్తమై కొద్ది రోజులుగా ఉంటున్నాడు. మంగళవారం ఉదయం శిల్ప ప్లాట్‌లో నిర్జీవంగా కనిపించడంతో స్థానికిలు పోలీసులకు తెలియజేశారు. రాత్రి భర్త గోపి హయత్‌నగర్‌లో ఉంటున్న తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లినట్లుగా తెలుస్తోంది.

దీంతో శిల్పను వరుసకు సోదరుడు అయిన శేషు చంపినట్లుగా భావిస్తున్నారు. వారి ఇంటిలోనే ఉంటున్న శేషు కనిపించక పోవడం కూడా అనుమానానికి దారి తీస్తున్నాయి. శిల్ప స్థానిక దత్తసాయి పాఠశాలలో ఉపాధ్యాయనిగా పని చేస్తున్నది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. భర్తను కూడా పోలీసులు విచారిస్తున్నారు. భార్యా భర్తలు మంచిగా ఉండేవారని స్థానికులు చెబుతున్నారు.

English summary
Woman murder came out in Hyderabad on women day. Shilpa, who is working as teacher in Dattasai school was killed by her brother. Some people accused her husband also. Police investigating case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X