నేనే ముఖ్యమంత్రిని అయితే, రద్దు ఫైల్‌పై తొలి సంతకం: వైయస్ జగన్
Districts
oi-Srinivas G
By Srinivas
|
శ్రీకాకుళం: నేను ముఖ్యమంత్రిని అయితే ఈస్ట్ కోస్ట్ థర్మల్ ప్రాజెక్టును రద్దు చేసే ఫైల్‌పై తన మొదటి సంతకం చేస్తానని మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం శ్రీకాకుళం జిల్లా సోంపేట జిల్లా పలాసపురంలో అన్నారు. థర్మల్ ప్రాజెక్టు ఉద్యమ బాధితులను ఆయన పరామర్శుస్తున్నారు. మంగళవారం కూడా ఆయన పర్యటన జిల్లాలో కొనసాగుతోంది. కాగా లక్కవరం గ్రామంలో ఓ గ్రామస్తుడు ప్రాజెక్టు పాపంలో దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి హస్తాన్ని ప్రశ్నించడంతో జగన్ తడుముకోక తప్పలేదు. నాతండ్రిపై ఉన్న అపవాదులు తొలగించడానికి ఇక్కడకు వచ్చానని చెప్పారు. చనిపోయిన కుటుంబాలను ఓదార్చడం నా బాధ్యత అన్నారు.
థర్మల్ ప్రాజెక్టును ప్రభుత్వం రద్దు చేసే వరకు ప్రజలతో కలిసి పోరాడుతుననా మాట ఇచ్చారు. బాధితులకు రద్దు చేసే వరకు అండగా ఉంటానని చెప్పారు. కాగా సోమవారం ఈస్ట్ కోస్ట్ థర్మల్ ప్రాజెక్టు వైయస్ హయాంలోనే వచ్చిందని, కానీ అప్పుడు ప్రజలు వ్యతిరేకించలేదని ఇప్పుడు మాత్రం వ్యతిరేకిస్తున్నారని కూడా జగన్ చెప్పారు.
Ex MP YS Jaganmohan Reddy promised that he will sign on East Coast Thermal Project cancellation file first, if he became chief minister. He is continuing his tour in Srikakulam district on tuesday. Public accused Jagan's father late CM YSR in project issue.
Story first published: Tuesday, March 8, 2011, 11:28 [IST]