లక్ష్మీపార్వతికి హైకోర్టులో చుక్కెదురు: ఇళ్లు ఖాళీ చేయాలని ఆదేశాలు

ప్రస్తుతం లక్ష్మీపార్వతి ఉంటున్న ఇంటిపై హక్కులు తమకే ఉన్నాయని ఉమా మహేశ్వరి నుంచి జీపీఏ పొందిన ఎన్.రామకృష్ణ పన్నెండేళ్ల క్రితం సిటీ సివిల్ కోర్టులో దావా వేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన సిటీ సివిల్ కోర్టు 2005 ఉమా మహేశ్వరికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు. అయితే దీనిపై లక్ష్మీపార్వతి హైకోర్టును వెళ్లగా సిటీ సివిల్ కోర్టు ఆదేశాలపై గతంలో స్టే ఇచ్చింది. ఈ స్టే ఎత్తి వేయాలని, ఇంటికి హక్కుదారులను నిర్ణయించాలని రామకృష్ణ అఫిడవిట్ వేశారు. ఈ పిటిషన్లను విచారించిన హైకోర్టు డివిజన్ బెంచ్ లక్ష్మీపార్వతి ఉంటున్న ఇంటిపై హక్కులు ఉమామహేశ్వరికే చెందుతాయని స్పష్టం చేసింది.
అయితే ఆ ఇళ్లు ఎన్టీ రామారావు ఉన్న సమయంలో ఆమెకు రాసిచ్చినప్పటికీ ఆ తర్వాత రామారావు అందుకు తగ్గ డబ్బులు ఉమా మహేశ్వరికి అప్పుడే ఇచ్చారని అంటున్నారు. అయితే అనుకోకుండా ఎన్టీరామారావు మృతి చెందటంతో పరిస్థితిలు మారిపోయాయని చెప్పారు.