చిరు బానిసలా మారాడు, జగన్‌ది కులపార్టీ: కత్తి పద్మారావు

Katti Padma Rao
గుంటూరు: ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు, ప్రముఖ సినీ హీరో చిరంజీవి, మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దళిత బహుజన రాజ్యాధికార ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు కత్తి పద్మారావు మంగళవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చిరంజీవి బానిసత్వానికి అలవాటు పడ్డాడని ఆరోపించారు. చిరంజీవి తన పార్టీ పీఆర్పీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం అత్మహత్యా సాదృశ్యమేనని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసే కొత్త పార్టీ కూడా కుల పార్టీగా ఉంటుందని ఆయన అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కుల పార్టీగా ముద్ర పడిపోయిందని, అయితే ఇప్పుడు జగన్ పార్టీకూడా అదే కుల పార్టీగా ఉండబోతుందని అన్నారు.

కాంగ్రెస్ మొదటి కుల పార్టీకాగా, జగన్‌ది రెండో కుల పార్టీగా అవతరిస్తోందన్నారు. రాష్ట్రంలో మహిళలపై ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయన్నారు. సాక్షాత్తూ ఓ మహిళ రాష్ట్ర హోంమంత్రిగా ఉంటున్నప్పుడు మహిళలపై దాడులు పెరగడం శోచనీయమన్నారు. ప్రభుత్వం మహిళలపై జరుగుతున్న దాడులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+