హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ కోసం టాంక్‌బండ్‌పై కెసిఆర్, జైళ్లో కోదండరాం ప్రతిజ్ఞ

By Srinivas
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే వరకు ఉద్యమిస్తామని, ప్రజలమంతా ఏకమై తెలంగాణ సాధిస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్‌నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురువారం టాంక్‌బండ్‌పైన ప్రతిజ్ఞ చేశారు. ట్యాంక్‌బండ్‌పై తెలంగాణవాదులు నిర్వహిస్తున్న మిలియన్ మార్చ్‌కు సంఘీభావం తెలిపేందుకు కేసీఆర్ అంతకుముందు పోలీసులను చేధించుకొని టాంక్‌బండ్ చేరుకున్నారు. తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోదండరాం, పలువురు తెలంగాణ టిడిపి నేతలు జైళ్లోనే ప్రతిజ్ఞ చేశారు. అనంతరం వారిని పోలీసులు విడిచిపెట్టారు.

కాగా పలువురు ఆందోళనకారులు అన్నమయ్య, ఎర్రాప్రగడ వంటి పలు విగ్రహాల్ని ధ్వంసం చేయడం పట్ల తెలంగాణ ప్రజా ఫ్రంట్ కన్వీనర్, ప్రజా గాయకుడు గద్దర్ అసంతృప్తి తెలియజేశారు. ధ్వంసం చేయడం మన సంస్కృతి కాదన్నారు. ఉద్యమంలో భాగంగా తెలంగాణకు చెడుపేరు తెచ్చే విధంగా ప్రవర్తించకూడదని ఆయన కోరారు. మార్చ్‌లో గద్దర్ పాలుపంచుకున్నారు. కాగా పోలీసుల అడ్డంకుల్ని అధిగమించి తెలంగాణవాదులు నిర్వహించిన మిలియన్ మార్చ్ ట్యాంక్‌బండ్‌పై చెదురుమదురు సంఘటనలు మినహాయించి ప్రశాంతంగానే ముగిసింది.

ట్యాంక్‌బండ్‌కు వెళ్లే అన్ని ప్రధాన రహదారుల్ని పోలీసులు మూసివేసినప్పటికి తెలంగాణ వాదులు భారీ సంఖ్యలో ట్యాంక్‌బండ్‌పైకి చేరుకుని తెలంగాణ అనుకూలంగా, సమైక్యాంధ్రకు వ్యతిరేకంగా నినాదాలు చే శారు. మిలియన్ మార్చ్ సంఘీభావం తెలుపుతూ వస్తున్న నేతల్ని అరెస్ట్ చేసినవారిని విడిచి పెట్టేంత వరకు ట్యాంక్‌బండ్‌పై నుంచి కదిలేది లేదని తెలంగాణ వాదులు బైఠాయించారు.

English summary
Telangana Rastra Samithi president K Chandrasekhar Rao promised for Telangana today at Tankbund. Telangana 
 
 Political JAC chairman Kodandaram and Telangana TDP leaders promised in jail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X