రెచ్చిపోయిన తెలంగాణవాదులు: అన్నమయ్య విగ్రహం ధ్వంసం

మరికొన్ని విగ్రహాలు పాక్షికంగా ధ్వంసం అయినట్టుగా తెలుస్తోంది. ఈ విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసినట్టుగా తెలిస్తోంది. ట్యాంక్‌బండ్‌పై వున్న కందుకూరి వీరేశలింగం పంతులు, శ్రీశ్రీ, పింగిళి వెంకయ్య, శ్రీకృష్ణదేవరాయలు, త్రిపురనేని రామస్వామి చౌదరి, మొల్ల విగ్రహాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. విగ్రహాల్ని ధ్వంసం చేస్తున్న కార్యక్రమాన్ని చిత్రీకరిస్తున్న ఓ ఛానెల్ కెమెరామెన్‌పై దాడి చేశారు. ఈ ఘటనలో కెమెరా ధ్వంసం కాగా, కెమెరామెన్‌కు స్వల్పంగా గాయాలయ్యాయి.
బషీర్ బాగ్ వద్ద భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు విద్యాసాగర్ రావు, తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకరరావును పోలీసులు అరెస్టు చేశారు. పలుచోట్ల పోలీసులను తోసుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నాలు తెలంగాణవాదులు చేయగా, పోలీసులు వారిని అదుపులోకి తీసుకన్నారు.












Click it and Unblock the Notifications