హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణకు వ్యతిరేకంగా నివేదికలు పంపలేదు: సిఎం కిరణ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: తెలంగాణ అంశం తన చేతిలో లేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోమవారం అన్నారు. తెలంగాణపై నిర్ణయం తీసుకునే అవకాశం నాది కాదని, అది కేంద్రం పరిధిలోనిది అని చెప్పారు. తెలంగాణపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని ఆయన మరోసారి స్పష్టం చేశారు. తెలంగాణ పేరుతో ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఎవరూ ఎటువంటి నివేదికలు కేంద్రానికి పంపించలేదన్నారు.

బడ్జెట్ సమావేశాల అనంతరం కేంద్ర ప్రభుత్వం అఖిలపక్షం ఏర్పాటు చేసి తెలంగాణ అంశంపై నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. అయితే మే నెల వరకు ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదన్నారు. మే తర్వాతే తెలంగాణపై కేంద్రం ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అయన ఆశాభావం వ్యక్తం చేశారు. శాసనమండలి ఎన్నికల్లో విప్ జారీ చేస్తామని చెప్పారు. విప్‌ను ధిక్కరించే వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

English summary
CM Kirankumar Reddy said today that Telangana issue is not in his hand. He hoped that Centre will take decission after May month. He said government will order whip in MLC elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X