సిఎంతో బాలినేని భేటీ, జగన్ క్యాంప్ ఎమ్మెల్యేలు ఏం చేస్తారు?

కాంగ్రెసు పార్టీ జయసుధ విప్‌ను తీసుకోవడానికి నిరాకరించడం, తాను ఆత్మప్రబోధానుసారం ఓటేస్తానని జగన్ వర్గానికి చెందిన ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యురాలు శోభా నాగిరెడ్డి చెప్పడం వంటి కారణాల వల్ల వైయస్ జగన్ వర్గం ఆలోచన మరో రకంగా ఉన్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి. క్రాస్ వోటింగ్‌కు పాల్పడకుండా తమ తమ పార్టీ శాసనసభ్యులకు కాంగ్రెసు, ప్రజారాజ్యం పార్టీలు విప్‌లు జారీ చేశాయి. జగన్ వెంట దాదాపు 19 మంది కాంగ్రెసు శాసనసభ్యులతో పాటు ఇద్దరేసి తెలుగుదేశం, కాంగ్రెసు శాసనసభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రజారాజ్యం పార్టీకి చెందిన శోభా నాగిరెడ్డి, కాటాసాని రాంరెడ్డి, తెలుగుదేశం పార్టీకి చెందిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, బాలనాగిరెడ్డి ఎటు వేస్తారనేది ఉత్కంఠగానే ఉంది. అలాగే, తెలుగదేశం పార్టీ తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు పోచారం శ్రీనివాస రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థికి ఓటు వేసే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు. వైయస్ జగన్‌కు, తెరాసకు మధ్య ఒప్పందం ఉందని, జగన్ వర్గం శాసనసభ్యులు తెరాస అభ్యర్థికి ఓటు వేస్తారనే ప్రచారం కూడా ఉంది. అయితే, అందులో ఏ మేరకు వాస్తవం ఉందనేది చెప్పలేం. మొత్తం మీద, ఎమ్మెల్సీ ఎన్నికలు ఉత్కంఠగానే ముగిసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications