కడప: ఓ హత్య కేసులో ఎనిమిది మంది తెలుగుదేశం పార్టీ నాయకులకు కోర్టు మంగళవారం జీవిత ఖైదు విధించింది. కడప జిల్లాకు చెందిన టిడిపి నేతలకు కోర్టు జీవిత కాలం ఖైదు విధించింది. 1995వ సంవత్సరంలో ఇద్దరు కాంగ్రెస్ నేతల హత్య కేసులో టిడిపి నాయకుల ప్రమేయం ఉందని కోర్టు తీర్పు చెప్పింది. దీంతో కోర్టు వారికి శిక్ష ఖరారు చేసింది.
వీరు కడప జిల్లాకు చెందిన ముద్దనూరు మండలం కోడిగాండ్లపల్లి గ్రామస్తులుగా తెలుస్తోంది. వారిని జైలుకు తరలించాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా వారు పై కోర్టుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.