జై తెలంగాణ అంటూ మోసం: పొంగులేటికి నాగం కౌంటర్

ఏం సాధించారని వారు సభకు వెళుతున్నారన్నారు. తెలంగాణ ఇస్తామని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ గానీ, ప్రధాని మన్మోహన్ సింగ్ గానీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గానీ హామీ ఇచ్చారా అని ప్రశ్నించారు. అధికార పక్షంలో ఉండి తెలంగాణ విషయంలో ఏం సాధించారని సభకు వెళుతున్నారని ప్రశ్నించారు. తెలంగాణ కోసం అందరం కలిసి పోరాడాల్సి ఉంటుందన్నారు. అందరూ కలిసి రాకపోతే ప్రజలు క్షమించరన్నారు.
పిఏసి చైర్మన్‌గా ఉండి తాను ఏమీ చేయలేదని పొంగులేటి అనడాన్ని ఆయన తప్పు పట్టారు. ఈపీసిలో 2400 రూపాయల అక్రమాలు జరిగాయని, అయితే మరికాస్త ఇన్‌ఫర్మేషన్ కావాల్సి ఉన్నందువల్ల అది ఆలస్యం అయిందన్నారు. దానిని త్వరలో బయటపెడతానని చెప్పారు.












Click it and Unblock the Notifications