చిరుపై శోభానాగిరెడ్డి ధిక్కారం: పీఆర్పీ విప్ జారీపై డోంట్ కేర్

పీఆర్పీ మరో అసంతృప్త ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కూడా శోభానాగిరెడ్డి దారిలోనే వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా అంతకుముందే పీఆర్పీ తన శాసనసభ్యులకు విప్ జారీ చేసింది. ఈ నెల 17వ తేదిన ఎమ్మెల్యేలు అంతా అందుబాటులో ఉండాలని విప్ జారీ చేసింది. కాంగ్రెసు మద్దతుతో ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యుల కోటా కింద ఒక ఎమ్మెల్సీ సీటుకు పోటీ చేస్తోంది. సీనియర్ నాయకుడు సి. రామచంద్రయ్యను ప్రజారాజ్యం అభ్యర్థిగా నిలబెట్టింది. చాలా కాలంగా శోభానాగిరెడ్డి, కాటసాని రాంరెడ్డి వైయస్ జగన్‌కు మద్దతిస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications