వీరప్ప మొయిలీనే మోసం చేశారు.. ఇక సామన్యులెంత..?

"ఆ బాటిళ్లలో నీటిని చూడగానే మనం దానిని మినరల్ వాటర్ అని భావిస్తాం.. కానీ వాళ్లు (మోసగాళ్లు) మినరల్ వాటర్‌కు బదులు వేరే ఇతర నీటిని నింపుతున్నార"ని సోమవారం ఢిల్లీలో జరిగిన వరల్డ్ కన్జ్యూమర్ డేని పురస్కరించుకొని హాజరైన నేషనల్ అండ్ స్టేట్ కన్జ్యూమర్ ఫోరస్ సభ్యుల సమావేశంలో న్యాయశాఖా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. మనం మోసపోతున్నామని, ఒక దేశపు న్యాయశాఖా మంత్రే మోసపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చునని, ప్రతి దశలోనూ మనం ఇలా మోసపోతూనే ఉన్నామని మోయిలీ ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications