అష్టలక్ష్మి సాక్షిగా ఆధిపత్యం కోసం ఇరు వర్గాల ఘర్షణ

సుధాకర్ గుప్తాను తీవ్రంగా వ్యతిరేకిస్తూ అమరవాది లక్ష్మీనారాయణ వర్గం ఘర్షణకు దిగిందని చెబుతున్నారు. పాలక మండలి సభ్యులు దాదాపు 90 మంది ఉన్నారు. వీరిలో 63 మంది చైర్మన్ పదవి కోసం సుధాకర్ గుప్తాకు ఓటేశారని చెబుతున్నారు. మూడు నెలల క్రితం ఈ ఎన్నిక జరిగింది. అయితే, ఆయన మాత్రం ఇటీవలే ప్రమాణ స్వీకారం చేసుకున్నారు. బుధవారం ఉదయం లక్ష్మీనారాయణ వర్గం దేవాలయానికి చేరుకుని ఘర్షణకు దిగినట్లు సమాచారం. దీంతో ఆలయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.












Click it and Unblock the Notifications