డిఎస్‌కు మతి భ్రమించింది: టిఆర్ఎస్‌ఎల్పీ ఈటెల రాజేందర్

Etela Rajender
హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డి శ్రీనివాస్‌కు మతి భ్రమించిందని తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ బుధవారం ధ్వజమెత్తారు. డిఎస్ టిఆర్‌ఎస్‌పై, టిఆర్ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావుపై ఆరోపణలు గుప్పించడం సరికాదన్నారు. టిఆర్ఎస్‌ను విమర్శిస్తే తెలంగాణ ప్రజలు డిఎస్‌ను తెలంగాణలోని పది జిల్లాల గ్రామాల్లో తిరగనివ్వరని హెచ్చరించారు.

ఆయన సొల్లు మాట్లాడటం మానుకోవాలన్నారు. అలాంటి సొల్లు మాటలు మాట్లాడినందుకే గత సాధారణ ఎన్నికలలో ఓటమి పాలయ్యారన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చేది మేమే తెచ్చేది మేమే అంటున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు, డిఎస్ సొల్లు మాటలు మాట్లాడుతున్నారన్నారు. వాటిని ప్రజలు నమ్మే స్థితిలో లేదన్నారు. తెలంగాణ ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యే కోటాలో జరిగే శాసనమండలి ఎన్నికలలో వారి వారి ఆత్మ ప్రభోదానుసారం ఓటును వేయాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+