కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

2014కు ముందే తెలంగాణ వస్తుంది: ఆర్టీసీ చైర్మన్ ఎమ్మెస్సార్

By Srinivas
|
Google Oneindia TeluguNews

M Satyanarayana Rao
కరీంనగర్: 2014 ఎన్నికలకు ముందే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరుగుతుందని ఆర్టీసీ చైర్మన్ ఎం సత్యనారాయణరావు బుధవారం కరీంనగర్ జిల్లాలో విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. కేంద్రం తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. వచ్చే సాధారణ ఎన్నికలకు ముందే తెలంగాణ ప్రకటించడం ఖాయంగా కనిపిస్తోందన్నారు. విగ్రహాలు కూల్చడాన్ని ఎమ్మెస్సార్ ఖండించారు. విగ్రహాలు కూల్చడం సరియైన పని కాదన్నారు. అయితే ప్రభుత్వం కూడా కూలిపోయిన విగ్రహాల స్థానంలో ఆయా విగ్రహాలను పెట్టడంతో పాటుగా తెలంగాణకు చెందిన ప్రముఖుల విగ్రహాలను పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రజలు ఆవేశంలో బస్సులను, ప్రభుత్వ ఆస్తులను నష్టం చేయడం తగదన్నారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల కారణంగా ఆర్టీసికీ తీవ్రంగా నష్టం సంభవించిందన్నారు. విధ్వంసాలు, బంద్‌ల కారణంగా ఆర్టీసీకి సుమారు 150 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందన్నారు. ప్రభుత్వాన్ని కొత్తగా బస్సులు ఇవ్వాలని కోరామని చెప్పారు. రెండువేల బస్సులకు ప్రభుత్వం ఒప్పుకుందని చెప్పారు. తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసే శక్తి ఎవరికీ లేదన్నారు.

English summary
RTC chairman M Satyanarayana Rao hoped that Centre will announce Telangana before 2014 elections. He urged public to do not destroy buses. He also demanded government to install telangana leaders statues along with destroyed statues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X