హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ భూకుంభకోణంపై మంత్రులు వర్సెస్ పయ్యావుల కేశవ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Payyavula Keshav
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన భూకుంభకోణాలపై బుధవాలం అసెంబ్లీ దద్దరిల్లింది. ఈ విషయంపై అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మధ్య తీవ్రస్థాయిలో వాగ్యుద్ధం నడిచింది. మంత్రులు శ్రీధర్ బాబు, బొత్స సత్యనారాయణ, టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మధ్య తీవ్ర వాదనలు జరిగాయి. వైయస్ హయాంలో భూకేటాయింపుల విషయంలో టిడిపి హైకోర్టుకు వెళ్లిందనే వాదనలను పయ్యావుల కేశవ్ ఖండించారు.భూముల కేటాయింపు విషయంలో మంత్రి శంకర్ రావే హైకోర్టుకు వెళ్లారని చెప్పారు. వైయస్ హయాంలో జరిగిన భూ కేటాయింపులపై జెఎల్పీ వేయాలని పయ్యావుల పట్టుబట్టారు.

శాసనసభను రాజకీయం చేయడానికి ఉపయోగించుకోకూడదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. వాటిని ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పారు. కాగా మరో మంత్రి బొత్స సత్యనారాయణ పయ్యావుల వ్యాఖ్యలను తప్పుబట్టారు. కోర్టులో కేసు నడుస్తుండగా దానిని శాసనసభలో చర్చించడం అర్థం లేదన్నారు. అది సరియైన విషయం కాదన్నారు.

English summary
It take rivalry between Ministers and TDP mla Payyavula Keshav on late YSR land scams today in assembly. Payyavula opposed government statement that tdp was went to high court on YSR scams.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X