చిదంబరం తనయుడు ఓట్లు కొన్నాడు, నోటుకు ఓటు ఎక్కువ: వికీలీక్స్

Wikileaks
న్యూఢిల్లీ: భారత్‌లో ఎన్నికలు పూర్తిగా అవినీతిమయమై పోయాయని వికీలీక్స్ మరో బాంబు పేల్చింది. భారత్‌లో రాజకీయ నాయకులు నోట్లతో ఓట్లు కొంటున్నారని ఆరోపణలు గుప్పించింది. గత సాధారణ ఎన్నికలతో పాటు జరగబోయే ఎన్నికలలో కూడా నోట్లకు ఓటును కొంటున్నాయని ఆరోపణలు గుప్పించింది. సాక్షాత్తూ కేంద్ర మంత్రి చిదంబరంపై కూడా ఆరోపణలు చేసింది. గత సాధారణ ఎన్నికలలో కేంద్ర హోంమంత్రి చిదంబరం తనయుడు ఓటర్లకు డబ్బులు పంచారని చెప్పింది. 2009 ఎన్నికల్లో పలు పార్టీలు భారీగా డబ్బులు ఓటర్లకు ముట్టజెప్పాయని చెప్పింది.

అయితే ఇంత జరుగుతున్నా ఎన్నికల కమిషన్ మాత్రం గాఢనిద్రలో ఉందని తెలిపింది. తమిళనాడు ఎన్నికల్లో అధికార పక్షం డిఎంకె, ప్రతిపక్షం ఏఐఏడిఎంకే ఓటర్లకు భారీగా ప్రలోభ పెడుతున్నాయని చెప్పింది. ఎన్నికల్లో డబ్బులు, వస్తువులు, బహుమతుల ద్వారా ప్రలోభ పెడుతున్నారని చెప్పింది. ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో కూడా నోటుకు ఓటు పద్ధతి దారుణంగా ఉందని చెప్పింది. అర్ధరాత్రి సమయంలో మురికి వాడలకు డబ్బుల సంచులు వెళుతున్నాయని చెప్పింది. దక్షిణాది రాష్ట్రాల్లో ఈ పరిస్థితి మరీ దారుణం. తమిళనాడులో పార్టీలో పోటీ పడి డబ్బులు పంచుతున్నాయని చెప్పింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+