ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాట వినని జెసి దివాకర్ రెడ్డి?

కాంగ్రెసు అభ్యర్థికి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఓటు వేసేలా చూడాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జెసి దివాకర్ రెడ్డికి సూచించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి మాటలకు ఆయన తలొగ్గడానికి సిద్దంగా లేరని తెలుస్తోంది. పాటిల్ వేణుగోపాల్ రెడ్డి కాంగ్రెసు అభ్యర్థియేనా అని ఆయన అడిగినట్లు చెబుతున్నారు. అంతేకాకుండా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల మనోభావాలకు అనుగుణంగా నడుచుకుంటానని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. పాటిల్ వేణుగోపాల్ రెడ్డి మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ మనిషి అని జెసి దివాకర్ రెడ్డి వాదిస్తున్నారు.