అసెంబ్లీకి పిండ ప్రదానం: బిజెపి, టిఆర్ఎస్ దూరం

కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వాలనుకుంటే 2004లోనే వచ్చేదన్నారు. గత డిసెంబర్ 9న కూడా తెలంగాణ ఇస్తానని సాక్షాత్తూ కేంద్ర మంత్రి చిదంబరం ప్రకటించి ఆ తర్వాత వెనక్కి తగ్గారన్నారు. వారే రాజ్యాంగాన్ని ఉల్లంఘించారన్నారు. తెలంగాణ వారు ఎక్కడా రాజ్యాంగాన్ని ఉల్లంఘించలేదన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు కూడా తమతో కలిసి రావాలని కోరారు. తెలంగాణ సమస్యపై చర్చించకుండా అసెంబ్లీ నిర్జీవంగా ఉందన్నారు. కేంద్రం వెంటనే తెలంగాణ సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. కాగా ఈ పిండ ప్రధాన కార్యక్రమానికి బిజెపి, టిఆర్ఎస్ పార్టీలు దూరంగా ఉన్నట్టుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications