కాంగ్రెసులోకి వైయస్ జగన్: లోకేష్ స్టూడియో ఎన్‌లో కథనం
State
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తనయుడు లోకేష్ ఛానల్ మరోసారి దాడి చేసింది. జగన్ త్వరలో తన మాతృ పార్టీ కాంగ్రెసులోకి వెళ్లి పోతారనే అనుమానాన్ని వ్యక్తం చేసింది. జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలను ఆత్మ ప్రభోదానుసారం ఓటు వేయాలని చెప్పటం కాంగ్రెసులోకి వెళ్లే ఉద్దేశ్యంతోనే అని ఆరోపించింది. జగన్ పార్టీ వీడినప్పటినుండి జగన్ కోసం రాజీనామాలకు సైతం సిద్ధం అని హెచ్చరికలు జారీ చేసిన ఆయన వర్గం ఎమ్మెల్యేలు ఆయన పార్టీ పెట్టాక ఏమీ మాట్లాడక పోవడం, ఎమ్మెల్సీ ఎన్నికలలో తమ ఓట్లు కాంగ్రెసు పార్టీకి వేయడంతో వారు వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోందని చెప్పారు.
జగన్ మళ్లీ కాంగ్రెసులోకి రావడానికే వారు కాంగ్రెసు వైపు మొగ్గినట్లుగా ప్రసారం చేసింది. అయితే జగన్ సొంత పార్టీ పెట్టినప్పటికీ కేంద్ర, రాష్ట్రాల్లో కాంగ్రెసు ప్రభుత్వం ఉండటం, ప్రభుత్వాలు జగన్ ఆస్తులపై కన్నేయడం దృష్ట్యా జగన్ వెనక్కి తగ్గాడని చెప్పింది. ఆదాయ శాఖ కన్ను కూడా పడింది. జగతి సంస్థలకు రెండు నోటీసులు కూడా జారీ చేసిన నేపథ్యంలో ఆస్తులను రక్షించుకోవడానికి ఆత్మ ప్రభోదానుసారం ఓటు వేయమని తన ఎమ్మెల్యేలకు చెప్పినట్లుగా ప్రసారం చేసింది. ఆస్తులు రక్షించుకోవాలంటే పాతగూటికే మొగ్గు చూపాలని, కాంగ్రెసుతో లోపాయికారి ఒప్పందు కుదుర్చుకోక తప్పదన్న భావనలో జగన్ ఉన్నాడని చెప్పింది.
TDP president Chandrababu Naidu son Lokesh Kumar Channel broadcosted against Ex MP YS Jaganmohan Reddy today. They suspected that he may return to Congress. It will cleared in mlc elections channel said.
Story first published: Friday, March 18, 2011, 14:15 [IST]