సిఎం కిరణ్, చంద్రబాబుల మధ్య భూకేటాయింపుల వాగ్యుద్ధం

కేటాయింపులపై జెఎల్‌పి వేసే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వస్తామని చెప్పారు. ఈ వివరాలను ప్రజలకు తెలియజేయాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. ప్రస్తుతం అన్ని చట్టసభలు అవినీతిపై చర్చిస్తున్నాయని చెప్పారు. భూ కేటాయింపుల వెనుక పెద్దల హస్తం ఉందన్నారు. కేటాయింపులలో అవకతవకలు చాలా ఉన్నాయన్నారు. భూ కేటాయింపుల అక్రమాల వలన వేలకోట్ల ప్రభుత్వ ధనం వృధా అయిందన్నారు. ముడుపులు తీసుకొని అప్పుడు ప్రభుత్వం భూకేటాయింపులు జరిపిందన్నారు.
కాగా ప్రతిపక్ష ప్రజాప్రతినిధుల ఆరోపణలకు ప్రభుత్వం స్పందించింది. భూ కేటాయింపుల వివరాలను సోమవారం ప్రకటిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రజలకు ఉపయోగపడే ప్రతిపక్షాల సలహాలను తప్పకుండా తీసుకుంటామని చెప్పారు. భూ కేటాయింపుల విధానాన్ని తప్పకుండా పరిశీలిస్తామని చెప్పారు. అనంతరం స్పీకరు నాదెండ్ల మనోహర్ సభను అరగంట పాటు వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications