వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నోకియా అమ్ముల పోదిలోకి మరో కొత్త టచ్ స్క్రీన్ ఫోన్ 'నోకియా సి7'

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

Nokia C7
న్యూయార్క్: ప్రపంచంలో ఎంతో పేరుగాంచిన మొబైల్ తయారీ సంస్ద నోకియా త్వరలో తన అంబుల పోదిలోకి మరో కొత్త మోడల్‌ని విడుదల చేయాడానికి సన్నాహాలు చేస్తుంది. నోకియా కంపెనీ నుండి విడుదలయ్యేటటువంటి ఈ టచ్ స్క్రీన్ ఫోన్ 'నోకియా సి7' అమెరికాలో ఏప్రిల్ 6వ తేదీన విడుదల చేయనున్నారు. నోకియా సి7 మొబైల్ సింబియన్ ఆపరేటింగ్ సిస్టమ్ కలిగిఉండడంతో పాటు, గతంలో వచ్చినటువంటి నోకియా ఈ7, నోకియా ఎన్8 మాదిరిలా ఉంటుందని దీనిని మార్కెట్ లోకి విడుదల చేసేటటువంటి టి-మొబైల్ వారు ప్రకటించారు.

అంతేకాకుండా ఈమొబైల్‌కి నోకియా మ్యూజిక్ లవర్స్ 'నోకియా ఆస్టండ్' బ్రాండ్‌గా నామకరణం చేయడం జరిగింది. ఇక 'నోకియా ఆస్టండ్' విషయానికి వస్తే 3.5 ఇంచ్ మోల్డ్ టచ్ స్కీన్ డిప్లేతోపాటు, 8మెగాపిక్సల్ కెమెరా తోపాటు డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్ కలిగి ఉందన్నారు. ఇక 'నోకియా ఆస్టండ్'కి ముందున్నటువంటి కెమెరా హెచ్‌డి 720పి సామర్ద్యంతో వీడియోస్‌ని తీయగలిగే విధంగా రూపోందించడం జరిగిందన్నారు. ఇది మాత్రమే కాకుండా కొత్తగా రూపోందించినటువంటి 'నోకియా ఆస్టండ్' హోమ్ స్కీన్ పైన ఆటోమాటిక్‌గా సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్ అయిన ఫేస్ బుక్ మరియు ట్విట్టర్‌లను డైరెక్టుగా ఓపెన్ చేసుకోగలుగుతారని అన్నారు.

ఇక మొమొరీ విషయానికి వస్తే మొబైల్‌తో పాటు 8జిబి ఇంటర్నల్‌గా వస్తుంది. మనం గనుక ఇంకా ఎక్కువ జిబి వేసుకోవాలని అనుకున్నట్లైతే 32జిబి మైక్రో యస్‌డి కార్డు సపోర్ట్ చేస్తుంది. వీటితో పాటు సాధారణంగా ఉండేటటువంటి వై పై టెక్నాలజీ, బ్లూటూత్, అన్ని రకాల మెయిల్స్‌ని కూడా ఓపెన్ చేసుకోవచ్చు. నోకియా సి7 ఫీచర్స్ మీకోసం ప్రత్యేకంగా......

Nokia C7 Specifications & Features:

* 3.5-inch capacitive touch screen (640 x 360 pixels)
* 8 megapixel camera with dual LED flash and HD video recording
* Symbian 3 OS
* Finger touch control
* Three customizable home screens
* GPRS/EDGE class B, multislot class 33
* HSDPA Cat9, maximum speed up to 10.2 Mbps, HSUPA Cat5 2.0 Mbps
* WLAN IEEE802.11 b/g/n
* Bluetooth 3.0
* Micro USB connector and charging
* 8 GB internal memory (extended upto 32 GB)
* HTML support for email
* Web browsing with touch control
* Integrated GPS, A-GPS receivers
* HD 720p Video playback on TV
* Stereo FM radio
* MP3, WMA, AAC, eAAC, eAAC+, AMR-NB, AMR-WB
* BL-5K 1200 mAh Li-Ion battery

నోకియా మాత్రం నోకియా సి7‌ కి సంబంధించి ఎటువంటి ఆఫీసియల్ రిలీజ్ డేట్, ఖరీదు ఇంకా అమెరికాలో ప్రకటించలేదు.

English summary
Nokia lovers in US can buy the new Nokia C7 in a new brand name called Nokia Astound on Apr 6, 2011. T-Mobile will offer Nokia Astound with a price tag of $79.99. Nokia C7 aka Nokia Astound runs on Symbian 3 operating system, which was featured on Nokia E7 and N8.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X