ఎవరి ప్రచారమో అనుకోవడం లేదు: హీరో రాజశేఖర్, జీవిత

జీతాల చెల్లింపుపై తాను మీడియా ద్వారానే తెలుసుకున్నానని రాజశేఖర్ అన్నారు. జీతాల మొత్తం ఖచ్చితంగా చెల్లిస్తానని ఆయన చెప్పారు. కాగా రాజశేఖర్ సంవత్సరం కాలంగా జీతాలు చెల్లించడం లేదన్న వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. కేవలం మూడు నెలల 20 రోజుల జీతాలు చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నట్లుగా తెలుస్తోంది.
కాగా అంతకుముందు రాజశేఖర్ సెక్యూరిటీకి సంవత్సరం నుండి జీతాలు చెల్లించడం లేదంటూ సిటీ సెక్యూరిటీ వింగ్ నోటీసులు జారీ చేశారనే వార్తలు వచ్చాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమయంలో చిరంజీవి అభిమానులు రాజశేఖర్‌పై దాడి చేసిన నేపథ్యంలో రాజశేఖర్ వైఎస్‌ను కలిసి సెక్యూరిటీని అడిగారు. ఆయన 2+2 సెక్యూరిటీని కేటాయించారు.
Comments
English summary
Hero Rajasekhar clarified today on city security wing notices. He condemned notice issue. He said he will pay total amount soon.
Story first published: Friday, March 18, 2011, 15:22 [IST]