పశ్చిమ బెంగాల్ సీట్ల సర్దుబాటుపై మమతతో కాంగ్రెసు రాజీ

అంతకు ముందు, పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెసు పార్టీతో కాంగ్రెసు సీట్ల సర్దుబాటు కొలిక్కి రాలేదు. మమతా బెనర్జీ సీట్ల విషయంలో మొండికేస్తుండడంతో రాష్టంలోని 294 సీట్లకు పోటీ చేయడానికి సిద్ధపడుతోంది. దీనిపై కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ తుది నిర్ణయం తీసుకుంటారు. పశ్చిమ బెంగాల్ పార్టీ వ్యవహారాల ఇంచార్జీ అహ్మద్ పటేల్ ఈ విషయంలో స్పష్టమైన సూచన ఇచ్చారు.
తాము మూడు జాబితాలు తయారు చేస్తున్నామని, 64 సీట్లకు, 90 సీట్లకు, 294 సీట్లకు పోటీ చేసేందుకు మూడు జాబితాలను రూపొందిస్తున్నామని, రాజకీయ పార్టీగా అన్ని సీట్లకు తమ అభ్యర్థులుండాలని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. అయితే, తృణమూల్‌తో పొత్తు కుదరాలని తాము భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. అయితే, పార్టీ అధిష్టానం నిర్ణయానికి తాము తలొగ్గుతామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications