ఏటియమ్ ద్వారా 24X7 మిల్క్... పూణె మిల్క్ కంపెనీ వినూత్న ఐడియా

వీరు ప్రవేశపెట్టనటువంటి ఆ ఐడియా ఏమిటంటే ఏటిమ్ నుంచి 24*7 మిల్క్ ప్యాకెట్స్‌ని కోనుగోలు చేయవచ్చు. ఆశ్చర్యపోకండి. ఇదేమి ఏప్రిల్ పూల్ జోకు కూడా కాదండి. ఈ ఐడియాని నిజంగానే మిల్క్ కంపెనీ ప్రవేశపెట్టింది. ఇది మాత్రమే కాకుండా ఏటియమ్(ఏనీ టైమ్ మిల్క్ ప్కాకెట్స్) అన్ని సమయాలలో మీకు చాలా తక్కువ ధరలో మిల్క్ ప్యాకెట్స్‌ని, మిల్క్ ప్రోడక్ట్స్ అందుబాటులోకి తేనున్నారు. ఈ సదావకాశం ఏప్రిల్ 4వ తారీఖునుండి పూణెలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్నామని ఖాట్రజ్ మిల్క్ డైరీకి సంబంధించిన వ్యక్తి తెలిపారు.
ఇక మొట్టమొదటి మిల్క్ ఏటియమ్‌ని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రారంభం చేస్తారు. ఈ సందర్బంలో ఆయన మాట్లాడుతూ ఈ మిల్క్ ఏటియమ్ వల్ల పబ్లిక్ నుంచి మంచి రెప్సాన్స్ వస్తే మాత్రం నగరంలో ఇంకా ఇలాంటివి పది ఏటియమ్‌లు వరకు పెట్టడం జరుగుతుందని అన్నారు. ఇక పూణె జిల్లా మిల్క్ ప్రోడ్యూసర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు రాంభౌ మాట్లాడుతూ మూడు సంవత్సరాలు నుండి మేము అతి తక్కువ ధరకే మిల్క్‌ని సప్లే చేయడం జరుగుతుంది. ఇప్పటికి ఈ ఏటియమ్ కల నిజమైంది. దీని ద్వారా మొట్టమొదట మేము ఆవుపాలు విక్రయించదలచుకున్నాం.
ఆ తర్వాత మిల్క్ ప్రోడక్ట్స్, మిల్క్‌కి సంబంధించినటువంటి అన్ని ఉత్పత్తులను విక్రయిస్తాం అని అన్నారు. ఇక ఈ ఏటియమ్‌లను గురించి శ్రద్ద తీసుకోవడానికి ప్రత్యేకంగా సిబ్బంది ఉంటుందన్నారు. ఇందుకోసం మొత్తం మూడు లక్షలు చెల్లించి ఏటియమ్‌ని అహ్మాదాబాద్ నుండి తెప్పించడం జరిగింది. ఇక ఈ ఏటియమ్ స్పెషాలిటీ ఏమిటంటే దీనికి కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది. దీనివల్ల ఇరవైనాలుగు గంటలు మిల్క్ చాలా ప్రెష్‌గా ఉంటాయి.