వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సిఎం కిరణ్‌కు చేదు అనుభవం: అపాయింట్‌మెంట్ కోసం వెయిటింగ్

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై పలువురు మంత్రులు కూడా గురువారం ఎమ్మెల్సీ ఎన్నికల ఓటమిపై ఫిర్యాదు చేసినట్టుగా వార్తలు వచ్చాయి. ప్రతిపక్ష టిడిపితో కాంగ్రెసు పార్టీ పొత్తు పెట్టుకోవడం వల్లనే ఓడిపోయిందంటూ సదరు మంత్రులు సిఎంపై ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. మధ్యాహ్నం వరకు ఖాళీగా ఉన్న సిఎం కిరణ్ మూడు గంటల ప్రాంతంలో కేంద్ర జల వనరుల మంత్రి సల్మాన్ ఖూర్షీద్‌ను కలిసేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ముఖ్యమంత్రిని అడ్డుకోబోగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.