వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండియాలో .XXX డోమైన్స్‌‌ని బ్లాక్ చేస్తున్నాం: ఐటి శాఖ ఆఫీసియల్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

XXX Domain
శాన్‌ ఫ్రాన్సిస్కో: శృంగార వెబ్‌సైట్ల ఆగడాలను నియంత్రించే దిశగా వాటి కోసం పోయిన శుక్రవారం .XXX డొమైన్‌ పేరుకు తుది ఆమోదం ఇచ్చిన విషయం తెలిసిందే. అంతర్జాల వ్యవహారాలను పర్యవేక్షించే ఐసీఏఎన్‌ఎన్‌ పెద్దవాళ్లకు సంబంధించిన విషయాలు ఉండే వెబ్‌సైట్లకు మాత్రమే ఈ పేరును వాడతారు. శృంగార వెబ్‌సైట్లు కొత్త డొమైన్‌ పేరుతో నమోదు చేయించుకోవాల్సిన అవసరం లేదు. కొత్త డొమైన్‌ పేరుతో నమోదు చేయించుకునే వెబ్‌సైట్లు ప్రత్యేక దరఖాస్తు చేసుకోవాలి. దీనివల్ల శృంగార వెబ్‌సైట్లను సందర్శించే వారికి వైరస్‌, క్రెడిట్‌కార్డు మోసాలు, సమాచార చోరి తదితర అంశాల బెడద ఉండదనే నమ్మకం కలుగుతుందని ఐసీఏఎన్‌ఎన్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

ఐతే దీనిపై మనదేశంలో ఐటి శాఖాకి సంబంధించినటువంటి ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ మనదేశంలో మాత్రం బూతు సైట్లకోసం ప్రత్యేకంగా కేటాయించినటువంటి ఈ .xxx డోమైన్‌ని బ్లాక్ చేయడం జరుగుతుందని చెప్పారు. ఇది మనదేశంలో ఉన్నటువంటి ఐటి యాక్ట్ మరియు ఇండియన్ లాస్‌కు విరుద్దంగా ఉండడం వల్ల ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఇది మాత్రమే కాకుండా మన ప్రక్క దేశాలు అయినటువంటి ఇండోనేషియాతో పాటు మిడిల్ ఈస్ట్ దేశాలు కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతించాయి.

ఈ సందర్బంలో సైబర్ లాయర్ వివేక్ సూద్ మాట్లాడుతూ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం ఇండియాలో సెక్స్ సినిమాలు చూడడం, చదవడం నేరం. ఇలా .xxx డోమైన్‌కు గనుక పరిమిషన్ ఇచ్చినట్లైతే .xxx డోమైన్‌లలో ఉన్న స్టోరీలను, మ్యాటర్‌ని మనవాళ్శు తెలివిగా .com, .in వెబ్ సైట్లలలో కూడా పోస్ట్ చేసే అవకాశం లేకపోలేదన్నారు. ఒకవేళ ఎవరైనా ఇలాంటి నేరాలకు ఎవరైనా పాల్పిడితే గనుక వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఇప్పటికే .xxx డోమైన్స్‌కు కోసం 2,00,000 అభ్యర్థనలు రావడం జరిగిందన్నారు. వీటిని ఈనెల చివరకల్లా అప్రూవ్ చేయనున్నారు.

English summary
India is set to block the Internet's newly-formed, highly controversial cyber “red-light district” after a global agency governing the web approved .xxx suffix for pornographic websites last week, a senior government official said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X