శ్రీజ భర్త శిరీష్ భరద్వాజ్‌కు బెయిల్ నిరాకరించిన కోర్టు
State
oi-Pratapreddy
By Pratap
|
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి కూతురు శ్రీజ భర్త శిరీష్ భరద్వాజ్‌కు కోర్టు ముందుస్తు బెయిల్ నిరాకరించింది. వరకట్నం వేధింపుల కేసులో అతనికి బెయిల్ ఇవ్వడానికి కోర్టు గురువారం తిరస్కరించింది. శిరీష్ భరద్వాజ్ తరఫున న్యాయవాది సివిఎల్ నర్సింహా రావు వేసిన బెయిల్ పిటిషన్‌ను హైదరాబాదు నాంపల్లి క్రిమినల్ కోర్టులోని 8వ అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ న్యాయమూర్తి తిరస్కరించారు.
శిరీష్ తల్లి, శ్రీజ అత్త సూర్యమంగళకు మాత్రం కోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. తన భర్త శిరీష్ భరద్వాజ్‌పై, అత్త సూర్యమంగళపై శ్రీజ వరకట్నం వేధింపుల కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీంతో శిరీష్ భరద్వాజ్ ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు.