కరుణానిధి ఇద్దరు భార్యలకూ ఆస్తిలో సమాన వాటా

కరుణానిధి భార్యల్లో దయాళు ఆస్తి విలువ 17.34 కోట్ల రూపాయలు కాగా, రజిత ఆస్తుల విలువ 18.68 కోట్ల రూపాయలు. దయాళు నలుగురు సంతానాల్లో కేంద్ర మంత్రి ఎంకె అళగిరి, ఉప ముఖ్యమంత్రి స్టాలిన్ ఉన్నారు. రజతి కూతురు కనిమొళి. కరుణానిధి మొదటి భార్య పద్మావతికి ఎంకె ముత్తు అనే కుమారుడున్నాడు. పద్మావతి మరణంతో కరుణానిధి 1948లో దయాళును పెళ్లి చేసుకున్నారు. కరుణానిధి ఇద్దరు భార్యలకు, ఆయనకు కూడా వ్యవసాయ భూములు లేవు. కరుణానిధికి ఆభరణాలు, కారు. ఇల్లు లేదు.












Click it and Unblock the Notifications