హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గ్రామాల్లో అసెంబ్లీ సమావేశాలు పెడదాం: డొక్కా మాణిక్య వరప్రసాద్

By Pratap
|
Google Oneindia TeluguNews

Dokka Manikya Varaprasad
హైదరాబాద్: మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ వినూత్నమైన ఆలోచనను ముందుకు తెచ్చారు. శాసనసభా సమావేశాలను ఆరు నెలల పాటు గ్రామాల్లో నిర్వహించాలని ఆయన ప్రతిపాదించారు. తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లోని మారు మూల గ్రామాల్లో ఆరు నెలలపాటు, హైదరాబాదులో ఆరు నెలల పాటు శాసనసభా సమావేశాలు నిర్వంచాలని ఆయన అన్నారు. దానివల్ల గ్రామాల సమస్యలు అర్థమవుతాయని ఆయన అన్నారు. కొండవీడులో శాసనసభా సమావేశాలు నిర్వహించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల్లో శాసనసభా సమావేశాలు నిర్వహించాలని కోరుతూ తాను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడికి లేఖలు రాస్తున్నట్లు ఆయన తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో శాసనసభా సమావేశాలు నిర్వహించడం వల్ల సమస్యలు అర్థమై పరిష్కరించడానికి వీలవుతుందని ఆయన అన్నారు.

English summary
Minister Dokka Manikya Varaprasad proposed to convene assembly session villages of three regions for six months. He said that it will become easy to understand public problems.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X