హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉద్యమాన్ని అణిచి వేయడానికే సాంబశివుడి హత్య: గద్దర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gaddar
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయడంలో భాగంగానే మాజీ మావోయిస్టు, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు సాంబశివుడు హత్య జరిగిందని ప్రజా గాయకుడు, తెలంగాణ ప్రజా ఫ్రంట్ నేత గద్దర్ ఆదివారం అన్నారు. సాంబశివుడి హత్యలో ఉన్న దోషుల్ని వెంటనే బహిర్గత పరచాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని అణచడానికి ఇలాంటి ప్రయత్నాలు చేయడం సరియైన చర్యకాదని ఆయన అన్నారు.

కాగా సాంబశివుడు మృతదేహానికి గాంధీ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టమ్ పూర్తిచేశారు. అంగతకుల దాడిలో గాయపడి, అతిగా రక్తస్రావం కావడంతో సాంబశివుడు మృతి చెందినట్టు పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్‌లో తేలింది. దాడి జరిగిన గంట తర్వాత ఆయన మృతి చెందినట్టు డాక్టర్లు తెలిపారు. సాంబశివుడు దేహంపై 20 కత్తిపోట్లు ఉన్నాయని రిపోర్టులో వెల్లడైంది.

English summary
TPF chairman Gaddar accused that trs leader Sambasivudu murder is part of destroy telangana agitation. He condemned murder today. He demanded government for reveal the accused.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X