గూండాల్లా వ్యవహరిస్తున్నారు, హైలెవల్ కమిటీ వేయాలి: కిషన్‌ రెడ్డి

Kishan Reddy
హైదరాబాద్: ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే శాసనసభ్యులు అసెంబ్లీకి వచ్చి వీధి రౌడిల్లా ప్రవర్తిస్తున్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సోమవారం అన్నారు. ఇలాంటి సంఘటనలు అసెంబ్లీలో పునరావృతం కాకుండా ఉండాలంటే ఈ సంఘటనపై హైలెవల్ కమిటీ వేయాలన్నారు. పొరపాటు చేసిన మంత్రులు, శాసనసభ్యులపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. సభలో ఇలా పార్టీలు కొట్టుకోవడం శోచనీయమన్నారు.ఇది మంచి సాంప్రదాయం కాదన్నారు. ప్రజలు ఓటు వేసి ప్రజాస్వామ్యయుతంగా సభకు పంపిస్తే ఇక్కడ వారు మాత్రం సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటూ మీసాలు దువ్వుకుంటూ, జబ్బలు చరుచుకుంటున్నారన్నారు.

ఇలా రౌడీల్లా ప్రవర్తించే వారని ప్రజలు సభకు పంపించవద్దని కోరారు. సభ్యులో తోటి సభ్యులు దాడి చేయడం హేయమని, ఇది చీకటి రోజని అన్నారు. మేధావులు, విద్యావంతులు, రాజకీయ విశ్లేషకులు అందరూ స్పందించి దీనిని ఖండించాలన్నారు. టిడిపి, కాంగ్రెసు రెండూ సభలో ప్రవర్తించే తీరు విచారకరమన్నారు. ఎవరూ వ్యక్తిగత ఎజెండాతో సభలోకి రావద్దన్నారు. ప్రజల ఎజెండాతో రావాలని కోరారు. ప్రజలు తమ కష్టాలు తీర్చడానికి ఎమ్మెల్యేలను గెలిపించి సభకు పంపిస్తే వీరు ఇక్కడ ఇలా ప్రవర్తించడం శోచనీయమన్నారు. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలకు ప్రజలు బుద్ది చెప్పాలన్నారు.

ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే అన్ని పార్టీలు కూర్చొని దీనిపై ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. ముఖ్యంగా టిడిపి, కాంగ్రెసులు ఆత్మ పరిశీనల చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో గవర్నర్‌పై దాడి విషయంలో విజువల్స్ బయట పెట్టడం తప్పని కిషన్ రెడ్డి అన్నారు. ఈరోజు జరిగిన సంఘటనలపై కూడా విజువల్స్ బయట పెట్టకూడదన్నారు. గుజరాత్, బీహార్‌లను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అక్కడి ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నట్లే ఇక్కడి ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారన్నారు. లల్లూ ప్రసాద్ యాదవ్ పార్టీ అక్కడి అసెంబ్లీలో రౌడీల్లా వ్యవహరిస్తే అక్కడి ప్రజలు బుద్ధి చెప్పారని, త్వరలో ఇక్కడి ప్రజలు కూడా పార్టీలకు బుద్ధి చెబుతారన్నారు.

భూములకు సంబంధించిన సమస్యను పక్కదారి పట్టించడానికే మంత్రి రఘువీరారెడ్డి, జగన్ వర్గం ఎమ్మెల్యేలు దాడి చేశారని సిపిఎం శాసనసభ్యుడు జూలకంటి రంగారెడ్డి ఆరోపించారు. హౌస్ కమిటీగానీ, జెఎల్పీ వేయకుండా కొందరు ఇలాంటి నాటకాలు ఆడుతున్నారన్నారు. మంత్రి హోదాలో ఉండి తోటి సభ్యులపై చేయి చేసుకోవడం విచారకరమన్నారు. సదరు మంత్రిపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ వైఫల్యాల కారణంగా భూకేటాయింపులపై చర్చకు రాకుండా చేస్తున్నారన్నారు. జెఎల్పీ వేయకపోవడం అక్రమాలనుండి తప్పించుకోవడానికే అన్నారు. ఇలాంటి వారిని ప్రజలు క్షమించరన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+