హసన్ అలీతో లింక్ చంద్రబాబుకేనా?, చిరునూ వదలని సాక్షి డైలీ

మాజీ ముఖ్యమంత్రి 2004 నాటికే భారీగా నల్లధనం దాచుకున్నారని హసన్ అలీ చెప్పిన విషయంపై సాక్షి డైలీ వ్యాఖ్యానిస్తూ 2004కు ముందు తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్నది చంద్రబాబే అని తేల్చింది. చంద్రబాబుతో పోరాడిన దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డికి మాజీ ముఖ్యమంత్రి హోదా లేదని స్పష్టం చేసింది. చంద్రబాబు దుబాయ్ సంబంధాలు హసన్ అలీ వ్యవహారంతో బయటపడిందని వ్యాఖ్యానించింది. ఇదంతా బయటపడుతుందనే భయంతో ముందుగానే చంద్రబాబు ఎదురు దాడికి దిగారని, తన పేరు స్పష్టంగా బయటపడిపోయిందని తెలిసి చంద్రబాబు తోక ముడిచారని చెప్పింది. నాయకుడిగా మారిన నటుడంటూ చిరంజీవి గుట్టును కూడా హసన్ అలీ బయటపెట్టాడని సాక్షి వ్యాఖ్యానించింది. సాక్షి డైలీ తన వార్తాకథనంలో చంద్రబాబు కడిగి ఆరేసింది.