బాబాయ్ వివేకా, అబ్బాయ్ జగన్‌కు పరీక్ష: మే 8న ఉప ఎన్నికలు

అయితే కేంద్ర ఎన్నికల సంఘం కడప, పులివెందుల ఉప ఎన్నికలతో పాటు ఉత్తర ప్రదేశ్, నాగాలాండు, చత్తీస్‌ఘడ్‌కు చెందిన ఉప ఎన్నికలు కూడా నిర్వహించనుంది. కాగా కడప ఎంపీ స్థానానికి జగన్, పులివెందుల శాసనసభ్యత్వానికి దివంగత వైయస్ సతీమణి విజయమ్మ గత సంవత్సరం అనగా 2010 నవంబర్ 29న రాజీనామా చేశారు. అప్పటినుండి ఆ నియోజకవర్గాలు ఖాళీ ఉన్నాయి. అయితే తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమబెంగాల్, అసోం రాష్ట్రాల సాధారణ ఎన్నికల కారణంగా కాస్త ఆలస్యమయినట్లుగా తెలుస్తోంది. ఆయా రాష్ట్రాల సాధారణ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన తర్వాత సిఈసి ఉప ఎన్నికల కోసం తేదీలను ఖరారు చేసింది.












Click it and Unblock the Notifications