నీతిలేని ఎమ్మెల్యేలతో జగన్‌ను ఎదుర్కొనే శక్తి లేదు: వీరశివా

వారికి ఏమాత్రం నైతికత ఉన్నా వెంటనే రాజీనామా చేయాలని అన్నారు. కడప పార్లమెంటు, పులివెందుల శాసనసభలకు కాంగ్రెసు అభ్యర్థులను నిలబెడతామని ఆయన చెప్పారు. జగన్ వెంట వెళుతున్న శాసనసభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధిష్టానానికి గట్టిగా చెప్పామని ఆయన అన్నారు. జగన్ వర్గం శాసనసభ్యులపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డి శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు.
ఆయన వెంట వెళుతున్న శాసనసభ్యులు పార్టీలోనే ఉంటే మేం జగన్‌ను ఎదుర్కోవడం కష్టం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. వారిని పార్టీనుండి సస్పెండ్ చేయకుంటే జగన్‌ను ఎదుర్కొనే శక్తి మాకు ఉండదన్నారు. వారిని సస్పెండ్ చేస్తేనే ప్రచారానికి వెళతామని, తద్వారా విజయాన్ని సాధిస్తామని చెప్పారు. నీతి, నిజాయితీ ఉంటే వారు వెంటనే పదవులకు రాజీనామా చేయాలన్నారు.












Click it and Unblock the Notifications