వైయస్ జగన్‌కే కీలకం, మాకు కాదు: మంత్రి బొత్స సత్యనారాయణ

కడప, పులివెందుల ఉప ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని ఆయన చెప్పారు. అయితే ఈ ఎన్నికలు జగన్‌కు కీలకమని చెప్పారు. టీడీపీ, ఇతర పార్టీల నుంచి నాయకులను తీసుకొచ్చి ఉప ఎన్నికల్లో పోటీకి నిలపాల్సిన ఖర్మ తమ పార్టీకి పట్టలేదన్నారు. వైఎస్ ప్రజా నాయకుడని, ఆయన ఫొటోను ఎవరైనా వాడుకోవచ్చని బొత్స సత్యనారాయణ అన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. కడప మాజీ ఎంపీ జగన్ ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాపై వైఎస్ ఫోటోను వాడడం పట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్న అంశాన్ని ప్రస్తావించగా, ఆయన పై విధంగా స్పందించారు.












Click it and Unblock the Notifications