వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కృష్ణా జిల్లా పార్టీ నాయకులపై చంద్రబాబు సీరియస్, సీనియర్లతో చర్చలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: కృష్ణా జిల్లా నాయకుల తీరుపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విభేదాలతో రచ్చకెక్కితే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. కృష్ణా జిల్లా విభేదాలతో నివేదిక ఇవ్వాల్సిందిగా బుచ్చయ్య చౌదరిని ఆయన ఆదేశించారు. ఆయన సోమవారం బుచ్చయ్య చౌదరితోనూ, పార్టీ ఇతర సీనియర్ నాయకులతోనూ సమావేశమై కృష్ణా జిల్లా రాజకీయాలపై చర్చించారు. అందరూ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి మాటకు కట్టుబడి ఉండాలని బుచ్చయ్య చౌదరి హెచ్చరించారు.

కృష్ణా జిల్లా పార్టీలో ఏ విధమైన సంక్షోభం లేదని ఆయన మీడియా ప్రతినిదులతో అన్నారు. దేవినేని ఉమా మహేశ్వర రావుకు, వల్లభనేని వంశీకి మంచి భవిష్యత్తు ఉందని ఆయన చెప్పారు. వంశీ పదే పదే రాజీనామా చేస్తే ఆమోదించక ఏం చేస్తామని ఆయన అన్నారు. పార్టీ నియమాలకు అందరూ కట్టుబడి ఉండాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని ఆయన అన్నారు. పార్టీలో విభేదాలు ఉంటే రోడ్డెక్కడం మంచిది కాదని హితవు పలికారు. వంశీ రాజీనామాను సాయంత్రం వరకూ చూసి వెనక్కి తీసుకోకపోతే ఆమోదిస్తామని వెల్లడించారు.

English summary
TDP president N Chandrababu Naidu expressed anguish at Krishna district party leaders. He met Buchaih Choudari to sort out differences among Krishna district leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X