వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాలి జనార్దన్ రెడ్డితో వైయస్ జగన్ లింక్స్ కడపలో కాంగ్రెసు అస్త్రం

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
కడప: బిజెపి నాయకుడు, కర్ణాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డితో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఉన్న సంబంధాలను కాంగ్రెసు పార్టీ తన ఆయుధంగా మలుచుకునే ఆలోచనలో ఉంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు పార్టీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ మంత్రులు, కడప జిల్లా నాయకులతో జరిపిన సమావేశంలో జగన్‌ను కడప పార్లమెంటు నియోజకవర్గంలో ఎదుర్కోవడానికి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. గాలి జనార్దన్ రెడ్డి, వైయస్ జగన్ కలిసి కడప జిల్లాలో తలపెట్టిన బ్రాహ్మణి స్టీల్స్ వ్యవహారాన్ని కాంగ్రెసు నాయకులు ఉప ఎన్నికల్లో వాడుకోవడానికి వ్యూహం రచించింది.

బ్రాహ్మణి స్టీల్స్ ద్వారా ఉద్యోగాలు కల్పిస్తామని గాలి జనార్దన్ రెడ్డి, వైయస్ జగన్ చెప్పిన మాటలు బూటకమని కాంగ్రెసు నాయకులు చెప్పనున్నారు. గాలి జనార్దన్ రెడ్డితో కలిసి కోట్లాది రూపాయలు సంపాదించుకోవడానికి మాత్రమే వైయస్ జగన్ ప్రయత్నించారని, ప్రజల కోసం జగన్ ఏ రోజు కూడా పనిచేయలేదని వారు విస్తృతంగా ప్రచారం చేయాలని అనుకుంటున్నారు. అలాగే, వైయస్ జగన్ ఏనాటికైనా బిజెపితో కలిసిపోతారని కూడా చెప్పదలుచుకున్నారు. గాలి జనార్దన్ రెడ్డితో ఉన్న సంబంధాలతో వైయస్ జగన్ బిజెపి వైపు వెళ్తారని కాంగ్రెసు నాయకులకు ప్రజలకు చెప్పాలని భావిస్తున్నారు.

కాగా, కడప ఉప ఎన్నికలో ఎమ్మెల్సీ మహ్మద్ జానీని కాంగ్రెసు పార్టీ అస్త్రంగా వాడనుంది. మైనారిటీ నాయకుడైన తనను ఓడించడానికి వైయస్ జగన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రయత్నించారని జానీ కడప ఓటర్లకు చెప్పనున్నారు. కడప పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెసు తరఫున జానీ కూడా ప్రచారం చేయనున్నారు. కడప ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్, ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి కాంగ్రెసు అభ్యర్థి డిఎల్ రవీంద్రా రెడ్డి విజయం కోసం ప్రచారం చేస్తారు. అలాగే, కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ కూడా ఎన్నికల ప్రచారానికి వస్తారని అంటున్నారు.

English summary
Congress finalised its strategy to face YS Jagan in Kadapa Loksabha seat. It wants to expose YS Jagan links with Karnataka minister and BJP leader Gali Janardhan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X