50వేల మెజారిటీ, చంద్రబాబు పెద్ద దొంగ జగన్ చిన్న దొంగ: డిఎల్
State
oi-Srinivas G
By Srinivas
|
కడప: త్వరలో జరగనున్న కడప పార్లమెంటు, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గాలలో కాంగ్రెసు పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి సోమవారం అన్నారు. కడప పార్లమెంటు కాంగ్రెసు అభ్యర్థిగా తాను యాబైవేల ఆధిక్యంతో గెలవడం ఖాయమని చెప్పారు. కాంగ్రెసు ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని అన్నారు. కాంగ్రెసు గెలుపును ఎవరూ ఆపలేరన్నారు.
కాగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పెద్ద దొంగ అయితే మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చిన్న దొంగ అని అన్నారు. ఇద్దరూ అవినీతిపరులే అన్నారు. కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి పెద్ద భూబకాసురుడు అన్నారు. ఈ నెల 16వ తేదిన మధ్యాహ్నం 12 గంటలకు తాను కడప పార్లమెంటు అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నట్లు చెప్పారు.
Minister DL Ravindra Reddy said today that he will win from Kadapa with 50 thousand majority. He blamed TDP president Chandrababu Naidu and Ex MP YS Jaganamohan Reddy.
Story first published: Monday, April 11, 2011, 13:16 [IST]