హరికృష్ణకు అవమానం జరిగితే మేం సహిస్తామా: ఎమ్మెల్యే కొడాలి నానీ

Kodali Nani
విజయవాడ: తమకు ఎన్ని అవమానాలు జరిగినా తాము సహిస్తామని, ఎన్టీ రామారావు కుమారుడు నందమూరి హరికృష్ణకు అవమానం జరిగితే కూడా సహిస్తామా అని తెలుగుదేశం గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నానీ అన్నారు. కృష్ణా జిల్లా పర్యటనలో హరికృష్ణను పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమా మహేశ్వర రావు అవమానించరంటూ ఆయన ఇటీవల ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. వంశీ రాజీనామా నేపథ్యంలో నానీ కూడా రాజీనామా చేస్తారని వార్తలు వచ్చాయి. తాను రాజీనామా చేస్తున్నట్లు వల్లభనేని వంశీ చెప్పారని, తన రాజీనామా విషయం ప్రస్తావనకు రాలేదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

వివాదాన్ని పరిష్కరించకుండా దేవినేని రాజీనామాను పార్టీ అధిష్టానం తిరస్కరించిందని చంద్రబాబు రాయబారి గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్పడం తమకు బాధ కలిగించిందని ఆయన అన్నారు. తన రాజీనామాను తిరస్కరించినట్లు పార్టీ అధిష్టానం తెలియజేసిందని టిడిపి కృష్ణా జిల్లా అధ్యక్షుడు, శాసనసభ్యుడు దేవినేని ఉమా మహేశ్వర రావు చెప్పారు. పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాలా, వద్దా అనే విషయంపై రేపు పార్టీ కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు. పార్టీకి నష్టం చేసే ఉద్దేశం తనకు లేదని, తన రాజీనామా అంతరార్థం ఏమిటో అర్థం చేసుకోవాలని వంశీ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+