విభేదాలలో పురందేశ్వరి పాత్ర లేదు, రాజీనామా చేయను: కొడాలి నాని
State
oi-Srinivas G
By Srinivas
|
విజయవాడ: తాను ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేసే ప్రసక్తి లేదని తెలుగుదేశం పార్టీ గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని సోమవారం అన్నారు. తాను తెలుగుదేశం పార్టీకి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తానని వచ్చిన ఆరోపణలలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. తాను దేనికీ రాజీనామా చేయడం లేదన్నారు. టిడిపి సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరికి సమాధానం చెప్పవలసిన అవసరం తమకు లేదన్నారు. జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావుకు తన సహకారం ఉండదన్నారు.
విభేదాలకు కేంద్ర మంత్రి పురందేశ్వరికి ఎలాంటి సంబంధం లేదని నాని చెప్పారు. చంద్రబాబు తనయుడు లోకేష్ కుమార్ వ్యాపారాలలో బిజిగా ఉండగా, సినిమాలలో జూనియర్ ఎన్టీఆర్ బిజీగా ఉన్నారన్నారు. అలాంటప్పుడు వారి మధ్య వారసత్వ పోరు ఎందుకు ఉంటుందన్నారు. టిడిపిలో వారిద్దరి కోసం వారసత్వ పోరు జరుగుతున్నదనడంలో వాస్తవం లేదన్నారు. దేవినేని ఉమను కొనసాగించే ముందు తమను చంద్రబాబునాయుడు పిలిచి మాట్లాడితే బావుండేదన్నారు.
MLA Kodali Nani blamed today TDP president Chandrababu Naidu today for continueing Devineni Uma as district president. He condemned comments on his resignation.
Story first published: Monday, April 11, 2011, 14:24 [IST]