వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్సార్ కుమారుడు వైయస్ జగన్ ఇలా చేస్తాడనుకోలేదు: ఉండవల్లి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Undavalli Arunkumar
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి తనయుడైన వైయస్ ఇలా చేస్తాడని తాము ఎప్పుడూ అనుకోలేదని రాజమండ్రి పార్లమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ సోమవారం విలేకరుల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్ అతిగా ఇష్టపడే ఇందిర కుటుంబంపై జగన్ ఆరోపణలు చేయడం తమను కలచి వేసిందని అన్నారు. అంతకుముందు ఉండవల్లి వైయస్ అసెంబ్లీలో మాట్లాడిన వ్యాఖ్యలను పవల్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విలేకరులకు చూపించారు.

అనంతరం మాట్లాడారు. అసెంబ్లీలో వైయస్ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీని కీర్తించిన విషయాన్ని ప్రస్తావించారు. తాను 1982 నుండి రాజీవ్, సోనియాలకు ట్రాన్సులేటర్‌గా వ్యవహరిస్తున్నానని తనకు వారి కుటుంబం గురించి తెలుసున్నారు. ఇందిర కుటుంబమే వైయస్‌ రాజకీయంగా ఎదగడానికి దోహదపడిందన్నారు. 1985, 1998లో పిసిసి అధ్యక్షుడిగా, 2004లో ముఖ్యమంత్రిగా కావడానికి కారణం ఇందిర కుటుంబమే అన్నారు.

1996 కడప పార్లమెంటు నుండి వైయస్ కేవలం మూడు వేల మెజార్టీతో గెలుపొంది, రాష్ట్రంలో కాంగ్రెసు ఘోర వైఫల్యం చెందినప్పుడు కూడా సోనియా వైయస్‌కే అధ్యక్ష పీఠాన్ని అప్పగించారన్నారు. వైయస్ ఎప్పుడూ సోనియా కుటుంబాన్ని విమర్శించలేదన్నారు. తాను ఆత్మాభిమానం చంపుకుంటే కేంద్ర మంత్రిని అయ్యేవాడిని అన్న జగన్ వ్యాఖ్యలను ఖండించారు. జగన్ వ్యాఖ్యలు వైయస్‌ను కించపరిచేవిగా ఉన్నాయన్నారు. వైయస్ ఏనాడు ఆత్మాభిమానం చంపుకోలేదన్నారు. జగన్ వేరే పార్టీ పెట్టుకోవడంలో తప్పులేదు. కానీ ఆయన తండ్రి వైయస్‌కు అత్యంత ఇష్టమైన కుటుంబంపై ఆరోపణలు చేయడమే తమకు బాధ కలిగించే విషయం అన్నారు. వైయస్ కోరుకున్న బాటలోనే కాంగ్రెసు నడుస్తుందన్నారు. ఇటాలియన్ కాంగ్రెసు అనే వ్యాఖ్యం జగన్ వాడదగింది కాదన్నారు. బిజెపి అధ్యక్షురాలు సుష్మాస్వరాజ్ ఆ వ్యాఖ్యాన్ని వాడారన్నారు.

సోనియాకు అత్యంత ఇష్టమైన వ్యక్తులలో వైయస్ మొదటివారన్నారు. జగన్ ఓదార్పును సోనియా గాంధీ అడ్డుకునే ప్రయత్నాలు చేశారనడంలో నిజం లేదన్నారు. జగన్ పార్టీలో ఆయన ఓదార్పులో పశ్చిమ గోదావరి జిల్లాలో తాను తప్ప అందరు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారన్నారు. అలాగే మిగతా జిల్లాల్లో కూడా పాల్గొన్నారన్నారు. వీరప్ప మొయిలీ కూడా ఓదార్పుకు అనుమతించారని స్వయంగా జగన్ వెల్లడించారన్నారు. అలాంటప్పుడు సోనియా ఓదార్పును ఎక్కడ అడ్డుకున్నదని ప్రశ్నించారు. వరంగల్‌లో మాత్రం ప్రాంతీయ విభేదాల కారణంగా అక్కడి ప్రజలు అడ్డుకున్నారన్నారు. వైయస్‌కు జగన్‌కు ఎంత అనుబంధం ఉందో, కాంగ్రెసు కుటుంబంలోని వ్యక్తిగా మాకు అంతే అనుభవం ఉందన్నారు. మంత్రి శంకర్‌రావు జగన్‌పై చేసిన ఆరోపణలు తాను సమర్థించడం లేదన్నారు. అలాగే తాను జగన్‌ను విమర్శించడం లేదన్నారు. కానీ సోనియా కుటుంబంపై విమర్శలు మానుకోవాలని కోరారు.

జగన్ పార్టీ పెట్టారు కాబట్టి కాంగ్రెసు పార్టీ వారు విమర్శించుతున్నారన్నారు. అందులో తప్పు లేదన్నారు. జగన్‌పై, వైయస్‌పై ఇతర పార్టీలలోని వారు ఆరోపణలు చేస్తే తాను ఖండిస్తానని సొంత పార్టీ వారు చేస్తే మాత్రం స్పందించనన్నారు. వైయస్ ఉన్నప్పుడైనా, లేనప్పుడైనా సొంత పార్టీ వారి విమర్శలపై స్పందించనన్నారు. వైయస్‌కు తాను అత్యంత దగ్గరివాడినన్నారు. వైయస్ గురించి తనకు తెలుసునన్నారు. జగన్‌పై ఏం మాట్లాడాలని అనుకున్నా వైయస్‌కు, కాంగ్రెసుకు ఉన్న ఆత్మీయ బంధమే ఏమీ మాట్లాడకుండా అడ్డు వస్తుందన్నారు. 2004-2009 మధ్య వైయస్‌ను ఎవరు ఏమన్నా తానే సమాధానం చెప్పానన్నారు. జగన్‌పై వేలకోట్ల ఖనిజ ఆరోపణలు వచ్చినప్పుడు కూడా తానే సమాధానం చెప్పానన్నారు. రాజకీయాలలో ఆరోపణలు రావడం సహజమే అన్నారు. తాను ఈనాడుపై, రామోజీరావుపై కూడా ఆరోపణలు చేసిన విషయం గుర్తు చేశారు.

జగన్‌పై కూడా ఆరోపణలు రోజూ వస్తున్నాయన్నారు. వాటిపై విచారణ జరిపిస్తే నిజానిజాలు బయటకు వస్తాయన్నారు. వైయస్ అసమ్మతిని ప్రోత్సహించారనటంలో నిజం ఉన్నప్పటికీ అది ఆరోగ్యకరమైనదన్నారు. కాంగ్రెసులో అసమ్మతి సాధాణమే అన్నారు. వైయస్ సొంత ప్రయోజనాల కోసం అసమ్మతి నేతగా ఉండలేదన్నారు. పార్టీ ప్రయోజనాల కోసమే ఆయన కృషి చేశారన్నారు. సోనియాగాంధీని రాజకీయాలలోకి రమ్మని బతిమాలిన వ్యక్తులలో వైయస్ కూడా ముఖ్యమైన వారన్నారు. రామోజీరావుపై తాను ఎప్పుడూ సైలెంట్‌గా లేనన్నారు.

జగన్ అంటే తమకు అభిమానం ఉందన్నారు. తమంటే ఆయనకు అభిమానం లేదన్నారు. వైయస్ చనిపోయాక ఆయన దేవుడయ్యారన్నారు. వైయస్ మా మనిషి మా నాయకుడన్నారు. జగన్ తనను విమర్శించాడని తాను విమర్శించ దల్చుకోలేదన్నారు. ఆయన కుర్రాడు ఆవేశంలో అన్నాడన్నారు. రాజకీయాలలో శత్రువులు ఉండరని విరోధులు ఉంటారన్నారు. కడప, పులివెందుల ఉప ఎన్నికల్లో కాంగ్రెసు గెలవాలని తాను ఆశిస్తున్నట్లుగా చెప్పారు.

English summary
Rajahmundry MP Undavalli Arunkumar opposed Ex MP YS Jagan and his group comments against AICC president Sonia Gandhi's family. He said late YS Rajasekhar Reddy have close link with Sonia family. He suggested Jagan to do not comment against Indira family.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X