చంద్రబాబు కార్యాలయానికి వల్లభనేని వంశీ రాజీనామా లేఖ
State
oi-Pratapreddy
By Pratap
|
విజయవాడ: పార్టీ విజయవాడ నగర అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తూ తన లేఖను వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయానికి పంపారు. ఫ్యాక్స్ ద్వారా తన రాజీనామా లేఖను ఆయన పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి పంపించారు. రాజీనామాను ఆమోదిస్తామని చెప్పిన పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు నాయుడి నాయకత్వంలో తాను తెలుగుదేశం పార్టీలో సాధారణ కార్యకర్తగా పని చేస్తానని ఆయన చెప్పారు. కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని ఉమా మహేశ్వర రావు నాయకత్వంలో తాను పని చేయలేనని అంటూ వంశీ తన పార్టీ పదవికి రాజీనామా చేశారు.
తన రాజీనామాపై సోమవారం ఉదయం నుంచి వంశీ భిన్నమైన ప్రకటనలు చేశారు. తొలుత రాజీనామా చేస్తానని చెప్పిన ఆయన పార్టీ కార్యకర్తల సమావేశంలో వెనక్కి తగ్గారు. రాజీనామాను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. కానీ ఆ తర్వాత మాట మార్చి రాజీనామాకే కట్టుబడి ఉన్నానని, కార్యకర్తల ఒత్తిడితో రాజీనామా ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పారు. చివరకు తన రాజీనామా లేఖను తెలుగుదేశం రాష్ట్ర కార్యాలయానికి ఫ్యాక్స్ చేశారు. కాగా, తాను రాజీనామా చేయబోనని గుడివాడ తెలుగుదేశం శానససభ్యుడు కొడాలి నాని చెప్పారు.
TDP Vijayawada urban president Vallabhaneni Vamshi has sent his resignation letter party president N Chandrababu Naidu through fax. He said that he will continue in TDP.
Story first published: Monday, April 11, 2011, 18:01 [IST]