మధకొడాకు చెందిన రూ. 130 కోట్ల విలువ చేసే అస్తుల జప్తు

మధు కొడా ఆస్తుల జప్తునకు సంబంధించిన మొదటి ఆదేశాలను ఇడి అందుకున్నట్లు తెలుస్తోంది. మధు కొడాకు, అతని అనుచరులకు 200 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే అస్తులున్నట్లు ఇడి గుర్తించింది. అందువల్ల మలి విడత ఇతర మరిన్ని ఆస్తుల జప్తునకు ఇడి ఆదేశాలు పొందవచ్చునని తెలుస్తోంది.
మధు కొడా, ఆయన అనుచరులకు చెందిన ఆస్తులు చాలా వరకు జార్ఖండ్‌లోనూ, బీహార్‌లోనూ ఉన్నాయి. ఆ ఆస్తులను సీల్ చేసి, వాటి క్రయవిక్రయాలను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేస్తుంది. కొడా అనుచరులు బినోద్, వికాస్ సిన్హా వంటివారి ఆస్తులను కూడా ఇడి జప్తు చేయనుంది.












Click it and Unblock the Notifications