వల్లభనేని వంశీ చేస్తే ఎన్టీఆర్‌పై కేసు పెడతామా?: డిఎల్ వ్యాఖ్యలపై మంగలి కృష్ణ

తనపై ఆరోపణలు వస్తే జగన్‌ను లక్ష్యంగా చేసుకోవడాన్ని ఖండించారు. పరిటాల రవి హత్యలో తన పాత్ర ఉన్నట్టు తేలితే మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డికి గాని, కాంగ్రెసు పార్టీకి గానీ రూ. కోటి రూపాయలు ఇస్తానని ఛాలెంజ్ చేశారు. అయినా గతంలో పరిటాల హత్యలో జగన్ పాత్ర లేదని చెప్పిన డిఎల్ ఇప్పుడు మాట ఎందుకు మార్చారని ప్రశ్నించారు. మద్దెల చెర్వు సూరి హత్య కేసులో విజయవాడ టిడిపి సీనియర్ నాయకుడు వల్లభనేని వంశీపై ఆరోపణలు వస్తే జూనియర్ ఎన్టీఆర్‌పై కేసు పెడతామా అని ప్రశ్నించారు.
డిఎల్ రవీంద్రా రెడ్డి, జగన్‌ను రాజకీయంగా ఎదుర్కొనలేకే ఇలాంటి అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తానపై వచ్చిన వాటికి ఏ ఆధారం లేదన్నారు. రాజకీయంగా జగన్‌ను దెబ్బతీసేందుకు తనను వాడుకుంటున్నారని ఆరోపించారు. ఇలా గుడ్డిగా ఆరోపణలు చేయదల్చుకుంటే ప్రతి వ్యక్తిపైనా ఆరోపణలు చేయవచ్చని ఆయన అన్నారు.