అంకుశం రామిరెడ్డి కన్నుమూత: జర్నలిస్టు నుండి విలన్‌గా ఎదిగిన వైనం

ఆ తర్వాత తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సుమారు 250కి పైగా చిత్రాల్లో కూడా నటించి మెప్పించారు. తెలుగులో ఒసేయ్ రాములమ్మ, అనగనగా ఒక రోజు, అమ్మోరు, పెద్దరికం, జగదీక వీరుడు అతిలోక సుందరి తదితర చిత్రాల్లో నటించారు. స్పాట్ పెడతా అనే ఆయన డైలాగ్ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అనగనగా ఒకరోజు చిత్రంలో కామెడీ పాత్రలో కూడా నటించి మెప్పించారు. కోడి రామకృష్ణ చిత్రాల్లో ఎక్కువగా నటించారు. ఆయన ఆఖరి చిత్రం మర్మం.
అంకుశం చిత్రాన్ని ప్రతిబంద్ పేరుతో చిరంజీవి కథా నాయకుడిగా హిందీలో నిర్మించారు. అందులో కూడా రామిరెడ్డి ప్రధాన ప్రతి నాయకుడి పాత్రను పోషించారు. ఉస్మానియా యూనివర్శిటీలో జర్నలిజంలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేసిన రామిరెడ్డి జర్నలిస్టుగా కూడా పని చేశారు. కొన్ని రోజులు హిందీ, ఉర్దు పత్రికలలో పని చేశారు.












Click it and Unblock the Notifications