చంద్రబాబుకు నాగం జనార్దన్ రెడ్డి షాక్, కడప ప్రచారానికి నో

కడప ఉప ఎన్నికల ప్రచారానికి తాను వెళ్లడం లేదని నాగం జనార్దనరెడ్డి తెలిపారు. తెలంగాణ ఉద్యమం ఉద్ధృతం చేయాల్సిన అవసరం ఉన్నందునే వెళ్లడం లేదని చెప్పారు. మనసులో దురాలోచనలు పెట్టుకుని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు యాగం చేస్తే ఫలితం ఉండదని అన్నారు. తెలంగాణ ఉద్యోగుల హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసేందుకే ప్రభుత్వం 177 జీవోను విడుదల చేసిందని ఆరోపించారు. తెలంగాణ ఉప ఎన్నికల్లో సీమాంధ్ర నాయకులు ప్రచారం చేయలేదని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ నేతలు కడపలో ప్రచారం చేయాల్సిన అవసరం లేదని నాగం అన్నారు.












Click it and Unblock the Notifications