జగన్ వర్గం ఎమ్మెల్యేలపై వేటుకు రెడీ: డిఎస్ ప్రకటనతో స్పష్టం

ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని చెప్పారు. మంత్రులు ఉప ఎన్నికలలో పాల్గొని ప్రచారం చేస్తే తప్పేమిటని ప్రశ్నించారు. కాంగ్రెసు పార్టీ నుండి ఎదిగిన వారిగా ఆ పార్టీ విజయానికి కృషి చేస్తున్నారని అన్నారు. ఉప ఎన్నికలలో తాను కూడా కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ గులాం నబీ ఆజాద్‌తో కలిసి ప్రచారం చేస్తానని చెప్పారు. తనకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఎలాంటి విభేదాలు లేవన్నారు. అంతకుముందు డిఎస్ పార్టీ కార్యలయంలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
తెలంగాణ ఉద్యమం జరుగుతున్న ఈ సమయంలో 177 చట్టాన్ని తేవడాన్ని ఆయన తప్పు పట్టారు. ఈ సమయంలో అది తేవడం సరైనది కాదన్నారు. కమలమ్మ కాంగ్రెసు పార్టీలోనే కొనసాగుతారని చెప్పారు. ఆమె కాంగ్రెసు పార్టీ నుండి గెలిచిందన్నారు.












Click it and Unblock the Notifications