• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

రెండాకులకు ఓటేసిన రజనీకాంత్, కెమెరాలకు చిక్కిన వైనం

By Pratap
|

Rajinikanth
చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రెండాకులకు ఓటేశారు. మీడియా కెమెరాల ఫ్లాష్‌లో ఆయన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఇవియం) మీట నొక్కుతూ పట్టుబడ్డారు. చెన్నైలోని స్టెల్లా మేరీస్ పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఆయన బుధవారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రహస్యంగా ఓటు వేయాల్సిన స్థితిలో కూడా ఆయనను పెద్ద యెత్తున మీడియా చుట్టుముట్టింది. ఆయన వోటేస్తున్నప్పుడు ఒక్కసారిగా కెమెరాలు క్లిక్‌మన్నాయి. ఆ వెలుగులో ఆయన పట్టుబడ్డారు.

తాను ఎవరికి ఓటేశారో ఫొటోలకు చిక్కిన విషయం తెలియని రజనీకాంత్ నవ్వుతూ - ధరల పెరుగుదల సమస్య అని, ప్రజలు స్థిరమైన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని , ఇవి కీలకమైన ఎన్నికలని ఆయన అన్నారు. రజనీకాంత్ ఎటు వేశారని గుర్తు పట్టే విధంగా కొన్ని చానెళ్లు దృశ్యాలను ప్రసారం చేశాయి. ప్రధాన ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ హెచ్చరికతో ఆ ప్రసారాలను తర్వాత నిలిపేశాయి. అటువంటి దృశ్యాలను ప్రసారం చేయడం నేరమని ఆయన హెచ్చరించారు. రజనీకాంత్ అన్నాడియంకె అభ్యర్తి బి వలర్మతికి ఓటిసేనట్లు బయటపడింది.

English summary
Actor Rajinikanth cast his vote on Wednesday just like many other voters in Chennai. But there was a difference. While others went behind the makeshift ply-board screen to exercise their franchise in privacy, the actor was caught in the act of pushing the button against the two-leaves' symbol on the electronic voting machine by the flashing cameras.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more