హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్సార్‌కు పట్టిన గతే కెసిఆర్‌కు పడుతుంది: టిడిపి నేత మోత్కుపల్లి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mothukupally Narasimhulu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ఫినిష్ అన్న దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఏమయ్యాడో అందరికీ తెలుసునని టిడిపిని లక్ష్యంగా పెట్టుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె చంద్రశేఖరరావుకు కూడా అదే గతి పడుతుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే మోత్కుపల్లి నరసింహులు గురువారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టిడిపిని ఇబ్బందులకు గురి చేస్తే కెసిఆర్ ఆస్తులు కాపాడుతామని కేంద్రం హామీ ఇచ్చినందునే కెసిఆర్ టిడిపిని లక్ష్యంగా చేసుకొని మాట్లాడుతున్నారని ఆరోపించారు. కేసిఆర్ తన కుటుంబం కోసమే యాగాలు చేస్తున్నాడని ఆరోపించారు. ఉద్యమాలు ఎలా చెయ్యాలో అన్నాహజారేను చూసి కెసిఆర్ తెలుసుకోవాలని సూచించారు.

ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, కాంగ్రెసు నేత అహ్మద్ పటేల్ టిఆర్ఎస్ కాంగ్రెసులో విలీనం అవుతుందని చెప్పిన మాటలు నిజం కాదా అని మరో ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు ప్రశ్నించారు. జితెందర్ ఎక్కడ కాలు పెడితే అక్కడ ఏమవుతుందో అందరికీ తెలుసునని అన్నారు. కెసిఆర్ తన కుటుంబం కోసమే తెలంగాణ ఉద్యమం అంటూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారన్నారు. తెలంగాణ ఇచ్చేది తెచ్చేది మేమే అన్న కాంగ్రెసును ఏమనకుండా టిడిపిని విమర్శించడం ఏమిటని ప్రశ్నించారు.

మనసులో దురాలోచనలు పెట్టుకొని కెసిఆర్ యాగాలు చేస్తే కోరికలు ఎలా నెరవేరుతాయని నాగం జనార్ధన్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ కోసం అవసరమైతే తెలంగాణ టిడిపి పోరం బాధ్యతలు తీసుకుంటుందని చెప్పారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా ఉన్న మైసూరారెడ్డిని గెలిపించమని అడగలేకే తాము ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లలేదన్నారు. తెలంగాణపై కెసిఆర్‌కు పెటెంట్ హక్కు లేదన్నారు. 177 చట్టం తీసుకు వచ్చి ఉద్యోగులపై ప్రభుత్వం యుద్దం ప్రకటించిందని ఆరోపించారు. దానిని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. లేదంటే మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

English summary
TDP MLAs Errabelli Dayakar Rao, Nagam Janardhan Reddy, Mothkupalli Narasimhulu fired at TRS president K Chandrasekhar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X